లక్కారంలో పౌర హక్కుల దినోత్సవం

పౌర హక్కుల దినోత్సవం
పౌర హక్కుల దినోత్సవం

నవతెలంగాణ ముత్తారం: ముత్తారం మండలం లక్కారం గ్రామంలో ఎస్సీ కమిటి హాల్లో మంగళవారం పౌర హక్కుల దినోత్సవం  రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సి కాలనీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ… గ్రామ స్థాయిలోనే సమావేశాలు నిర్వహిస్తే సమస్యలపై స్పష్టత వస్తుందని అదే విధంగా ఎస్సీ, ఎస్టీలకు అందవలసిన పథకాలు సకాలంలో అందుతున్నాయో లేదా అని తెలుసుకునే అవకాశం ఉంటుందని అనంతరం సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయని, అంటరానితనం నిర్మూలనపై ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న ఆకృత్యాలపై అదే విధంగా బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలించి బాలలను బడికి పంపే విధంగా చూడాలని బాల కార్మికులతో పనులు చేయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఎస్సీ, ఎస్టీల యొక్క సంక్షేమ ఫలాలు రేషన్ కార్డు, ఆసరా పెన్షన్ ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో తెలుసుకోవడం కోసమే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అత్తె లలిత, పోలీస్ అధికారులు పాటు ఎస్సీ కుల పెద్దలు పాల్గొన్నారు.

Spread the love