- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తత నెలకొంది. స్పెయిన్ విజయం సంబరాలు జరుపుకుంటున్న సమయంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరేడెస్, స్పెయిన్ ఆటగాడు గావిపై దాడికి దిగాడు. అతడిని తోసేసి ముఖంపై పిడిగుద్దులు కురిపించగా, అడ్డుకునేందుకు వచ్చిన మరో ఆటగాడిపై కూడా దాడి చేశాడు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రిఫరీ పరేడెస్‌కు రెడ్‌కార్డ్ చూపించినా అతడు శాంతించకపోవడంతో మైదానంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
- Advertisement -



