కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు

Class differences in Congress– బి.జ్ఞానేశ్వర్‌, కే.నరేందర్‌
– వర్గాలుగా విడిపోయిన నాయకులు
– కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు
– కస్తూరి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు డుమ్మా
నవతెలంగాణ-శంషాబాద్‌
మండల కాంగ్రెస్‌లో అంతర్గతవర్గ విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. కాంగ్రెస్‌ అధికా రంలోకి రాకముందు రాజేంద్రనగర్‌ నియోజకవ ర్గం పార్టీ ఎమ్మెల్యే టికెట్‌ కోసం బొర్ర జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ ఆశించి భంగపడ్డారు. ఆయన స్థానం లో మణికొండ మున్సిపాలిటీ చైర్మెన్‌ కస్తూరి నరేం దర్‌కు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించింది. అయితే అప్పటివరకు పార్టీ కార్య క్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ జ్ఞానేశ్వర్‌ అనుచరు లుగా కొనసాగిన ఎంతమంది నేతలు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరైనా సరే గెలిచే లక్ష్యంగా పనిచేయా లని నిర్ణయించుకుని కస్తూరి నరేందర్‌కు మద్దతు గెలుపు కోసం కృషి చేశారు. అయితే మండల కాం గ్రెస్‌ అధ్యక్షులు గడ్డం శేఖర్‌ యాదవ్‌ తమ నాయ కుడు జ్ఞానేశ్వర్‌కు టికెట్‌ రాకపోవడంతో తీవ్ర నిరాశలోకి జారుకున్నారు. పార్టీ సమావేశాలకు ముఖ్యకార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. అనంతరం కస్తూరి నరేందర్‌ స్వయంగా శేఖర్‌ యాదవ్‌ ఇంటికెళ్లి అతనితో మాట్లాడి ఒప్పించి పార్టీ కార్యకర్తల్లో పాల్గొనేలా చేశారు. ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత పార్టీ కార్యక్రమాలు నిర్వహిం చడానికి రాజేంద్రనగర్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కస్తూరి నరేందర్‌ను అధిష్టానం నియ మించింది. ఇందులో భాగంగానే ఆయన శంషా బాద్‌ మండలంలో కాంగ్రెస్‌ కార్యక్రమాలను ముం దుండి నడిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభు త్వం కార్పొరేషన్‌ చైర్మెన్‌ల నియామకం చేపట్టిం ది. ఇహ బొర్ర జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్కకు కార్పొరేష న్‌ చైర్మెన్‌ పదవి వచ్చింది. దీంతో తన అభిమాన నాయకునికి పదవి రావడంతో గడ్డం శేఖర్‌యా దవ్‌ ఆయన వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. కస్తూరి నరేందర్‌తోగానీ స్థానిక నేతలతో కలిసి పనిచేయడం కాకుండా సొంత క్యాడర్‌తో ముందు కు వెళ్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కస్తూరి నరేందర్‌ శంషాబాద్‌ మండలంలో వివిధ కార్యక్ర మాల్లో పాల్గొన్నప్పటికీ అతనితో కలిసి పని చేయ డానికి సిద్ధపడటం లేదు. టీపీసీసీ ఎస్సీసెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు జలపల్లి నరేందర్‌ ఆ స్థాయిలో లేక పోయినా కొంత దూరంగానే ఉంటున్నారు. మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్‌, మండల ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కోటేష్‌ గౌడ్‌, చిల్కమర్రి మహేందర్‌, సుల్తాన్‌పల్లి మాజీ సర్పం చ్‌ యాటకారి సిద్దేశ్వర్‌ వంటి కీలక నేతలతో పని చేయడానికి ఆయన ముందుకు రావడం లేదు. మండలంలో వాళ్ల సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో కస్తూరి నరేందర్‌ సమక్షంలో వివిధ పార్టీల నాయకుల చేరికల కార్యక్రమాలలో శేఖర్‌ యా దవ్‌ పాల్గొనడం లేదు. అనుకోకుండా తారసపడిన ఒకరినొకరు పలకరించుకోలేని పరిస్థితి ఏర్పడిం ది. బయటకి బహిరంగ విమర్శలు చేయకపోయి నా అంతర్గతంగా ఒకరిపై ఒకరికి వ్యక్తిగత విభేదాలు వారు చేసే కార్యక్రమాల ద్వారా బయట కి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధి లో కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాలు మం డలంలో కూడా కనిపించడం వల్ల ఎవరికి ఎంత మేరకు మేలు జరుగుతుందనేది చూడాల్సి ఉంది. ఈ విషయంలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కార్యక్రమాలు జరిగితే మాత్రం ప్రతిపక్ష పార్టీలకు మేలు జరిగే అవకాశం ఉంది.

Spread the love