పోలవరం అభివృద్ధి పనులను జగన్ కొనసాగించలేదు: సీఎం చంద్రబాబు

నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..డయాఫ్రామ్ వాల్ 35శాతం డ్యామేజ్ అయ్యిందని, గత ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్ ను కాపాడలేకపోయిందని అన్నారు. రూ.550కోట్ల రూపాయలతో రెండు కాఫర్ డ్యామ్ లను నిర్మించారని, కాఫర్ డ్యామ్ ల మధ్య గ్యాప్ ని పూడ్చలేకపోయారని అన్నారు. గత ప్రభుత్వం పనులను కొనసాగించి ఉంటే పోలవరం 2020లోనే పూర్తయ్యేదని అన్నారు. ఒక వ్యక్తి రాష్ట్రానికే శాపంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

Spread the love