మహనీయులకు అవమానం

టాయిలెట్‌ల పక్కన మహనీయుల విగ్రహాలు... ఆందోళన చేస్తున్న తంగిరాల సౌమ్య
టాయిలెట్‌ల పక్కన మహనీయుల విగ్రహాలు… ఆందోళన చేస్తున్న తంగిరాల సౌమ్య

నవతెలంగాణ నందిగామ: ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామ గాంధీ సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి భారీ పోలీసు బందోబస్తు మధ్య జాతీయ, రాష్ట్ర నేతల విగ్రహాలను అధికారులు తొలగించారు.  తొలగించిన వాటిలో మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌, అబ్దుల్‌కలాం, రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్‌, గుర్రం జాషువా, దేవినేని వెంకటరమణ, తంగిరాల ప్రభాకరరావు తదితర నేతల విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను మున్సిపల్ కార్యాలయంలో టాయిలెట్‌ల పక్కన పెట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహనీయులకు కనీస గౌరవం ఇవ్వకుండా ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విగ్రహాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Spread the love