నవతెలంగాణ – మిడ్జిల్
జూన్ నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడ్జిల్ మండల పర్యటన సందర్భంగా పాలమూరు జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం, మండల శాఖ అధికారులు, సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలు, చిన్న గ్రామ పంచాయతీలు చేపట్టబోయే అభివృద్ధి పనులు, నివేదికలు పంచాయతీ కార్యదర్శులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఆయన చెప్పారు. సర్పంచులు నిధుల కోసం పారదర్శకంగా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసిల్దార్ రాఘవేందర్ రెడ్డి, ఎంపీడీవో గీతాంజలి, ఎంపీ ఓ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్ , శ్రీశైలం ,నాగరాజు, నాయకులు వెంకటయ్య, సాయిలు, జంగయ్య, ప్రశాంత్ రెడ్డి , మల్లికార్జున రెడ్డి, భాస్కర్ నాయక్, శంకర్ నాయక్ , తదితరులు పాల్గొన్నారు.


