
-పోలింగ్ సిబ్బందికి అన్ని ఏర్పాట్లు…
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
పోలింగ్ విధుల అనంతరం పీఓలకు ఏపీఒలకు వారి ప్రాంతాలకు వెళ్ళుటకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎన్ఐసి హాల్ నందు స్పెషల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. 13వ తేదీన పోలింగ్ ముగిసిన అనంతరం ఇతర ప్రాంతాల నుండి విధులకు వచ్చిన వారిని ఉచితంగా వారి ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. బస్సు రూటు తెలిసే విధంగా బస్సులపై సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఆ ప్రాంతాల పెర్లు కూడా సైన్ బోర్డులపై రాయాలని కలెక్టర్ తెలిపారు. ఖమ్మం, నల్గొండ జిల్లాలకు వెళ్లే ఉద్యోగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు అలాగే హైదరాబాదు వెళ్లే ఉద్యోగులకు చార్జీలతో కూడిన రవాణా సౌకర్యం కల్పించ బడుతుందని కలెక్టర్ తెలిపారు. ఉద్యోగుల రవాణా సౌకర్యాన్ని పరిశీలించేందుకు నలుగురు స్పెషల్ ఆఫీసర్లను ,నలుగురు డిప్యూటీ తాసిల్దార్లను, నలుగురు ఆర్టీసీ అధికారులను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ రోజున సిబ్బందికి అన్ని సౌకర్యాలు పరిశీలించడానికి 46 మంది వెల్ఫేర్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వెల్ఫేర్ అధికారులు శనివారం అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలి అక్కడ ఏ ఎమ్ ఎఫ్, బి ఎం ఎఫ్ ఏర్పాట్లు పరిశీలించాలి అలాగే విధులు నిర్వహించే ఉద్యోగులకు భోజనం, కరెంటు, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, చలవ పందిళ్లు ఏర్పాట్లను పరిశీలించి పూర్తి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్, డి ఎం డబ్ల్యు ఓ జగదీశ్వర్ రెడ్డి, పంచాయతీరాజ్ అధికారి వెంకటేశ్వర్లు, రవాణా శాఖ అధికారి సురేష్ రెడ్డి, డిఇఓ అశోక్ ,కలెక్టరేట్ ఏవో మసూదన్ రెడ్డి, ఎన్నికల సూపర్డెంట్ శ్రీనివాసరాజు, అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.