పాల రైతుల పెండింగ్ బిల్లులను వెంటనే ఇవ్వాలనీ కలెక్టర్ కు వినతి…

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
పాల రైతుల పెండింగ్ పాల బిల్లులని వెంటనే చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ అధ్వర్యంలో విజయ డెయిరీ డీ డీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైనతెలంగాణా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ మాట్లాడుతూ.. గత ఆరు మాసాలుగా సహకార పాడి పరిశ్రమ నమ్ముకుని జీవనం సాగిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని వేలాదిమంది పాడి రైతుల, అనేక ఇబ్బందులు పడుతున్నారని పాల బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల, బిల్లులు రాక, పోషణ కష్టంగా మారిందని, పశుగ్రాసం పశువుల దాణా ధరలు విపరీతంగా పెరిగి అప్పులు చేసి పశు పోషణ చేస్తున్నామని, పాల ఉత్పత్తి జీవనాధారంగా ఉన్న మా పాడి రైతుల కుటుంబాలు నెలల తరబడి పాల బిల్లులు రాక, పిల్లల చదువులు కుటుంబ పోషణ గా కష్టంగా మారిందని పాల రైతుల పెండింగ్ లో ఉన్న పాల బిల్లులని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సహకార పాడి పరి  శ్రమను నమ్ముకొని జీవనం గడుపుతున్న పాడిరైతులకు ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించాలని పాల రైతులకు ప్రతి లీటర్ కు 5 రూపాయల ఇన్సెంటివ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డెయిరీ ఫామ్ యజమానులకు, కనీసం బావుల వద్ద పశువులు పెంచుతున్న పాల రైతులకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయాలని, పాడి పశువులకు ఉచిత ఇన్సూరెన్స్ పథకం అందించి, గడ్డి కట్టర్ మిషన్లు, పాలు పిండే మిషన్, పశువుల దాణా 50% సబ్సిడీతో చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.  జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండాగే కి పాల రైతుల డిమాండ్లతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని కలెక్టర్ కు అందించి రైతుల గోడు విన్నవించుకోగా వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తొలుత భువనగిరి జిల్లా కేంద్రంలోని విజయ డైరీ  డిడి కార్యాలయం వద్ద  ధర్నా నిర్వహించి జిల్లా అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బస్వాపురం, పాల ఉత్పత్తిదారుల చైర్మన్ కోయగూర మల్లికార్జున్, నమాత్ పల్లి ఉత్పత్తిదారుల చైర్మన్ ఎల్లంల వెంకటేశం, నరాల చంద్రయ్య, చిక్కుల్ల పాండు, రాసాల రాజు, మచ్చ భాస్కర్, రాసాల నవీన్, కోయకూర కర్ణాకర్ పూస రాములు,స్వామి, నోముల రమేష్, ఎనబోయిన అనిల్, గాండ్ల నరసింహ, నోముల లక్ష్మీనారాయణ గువ్వ కొండల్ పాల్గొన్నారు.
Spread the love