సీఎంఆర్ డెలివరీ జూన్ 15 కల్లా పూర్తి చేయాలి: కలెక్టర్

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఖరీఫ్ సీజన్ 23- 24 గాను సీఎంఆర్ రైస్ డెలివరీని జూన్ 15లోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మిల్లర్ల ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ సమావేశ మందిరం నందు జిల్లా ఆదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు తో కలిసి జిల్లాలోని రైస్ మిల్లర్లు సంబంధిత అధికారులతో సీఎంఆర్ రైతు డెలివరీ పై సమీక్షించారు.సీఎంఆర్ రైస్ డెలివరీ జూన్ 15 కల్లా పూర్తి చేయాలని నిర్దేశత సమయంలో గా మిల్లుల వారిగా తమ కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు సకాలంలో మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగించకపోతే అట్టి మిల్లులపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు సమావేశానికి రాని రైస్ మిల్లుల యజమానులకు రెవెన్యూ సమన్స్ ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ కు కలెక్టర్ ఆదేశించారు. మిల్లుల వారిగా వారి లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ జనార్దన్ రెడ్డి, డిఎస్ఓ మోహన్ బాబు, సివిల్ సప్లై డిఎం రాములు డిఎం మార్కెటింగ్ సోమశేఖర్ శర్మ ఏఎస్ఓ పుల్లయ్య కోదాడ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు, సెక్రెటరీ, మధు, జయప్రకాష్, సూర్యాపేట సెక్రెటరీ చంద్రశేఖర్, డిటిసిఎస్ లు రామ్రెడ్డి, రాజశేఖర్, నాగలక్ష్మి, విజయ శేఖర్, 50 మిల్లులకు చెందిన యజమానులు పాల్గొన్నారు.
Spread the love