గ్రూప్స్, డీఎస్సీకి ఉపయోగ పడే పుస్తకాలు అందుబాటులో ఉంచాలి: కలెక్టర్

– గ్రంథాలయ ఉద్యోగులను అభినందించిన కలెక్టర్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
గ్రూప్స్, డి.ఎస్.సి కి ప్రిపేర్ అవుతున్న  అభ్యర్థులకు  ఉపయోగ పడే విలువైన పుస్తకాలు  అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్ర గ్రంధాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్బంగా  వివిధ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో గ్రంధాలయంలో అందిస్తున్న వసతుల పై అడిగి తెలుసుకున్నారు. గ్రూప్స్, డి.ఎస్.సి పరీక్షల సమయం దగ్గరగా ఉన్నందున విజయవకాలు  చేరాలంటే ఎక్కువ దృష్టి పెట్టి చదవాలని సూచించారు. గ్రంథాలయంలో గ్రూపు-1 పరీక్షలకు మరియు ఇతర పోటి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థిని విద్యార్థులకు అన్ని పరీక్షలలో విజయం సాధించాలని అందరికీ తన అభినందనలు  తెలిపారు. అదేవిదంగా గ్రంథయాలంలో బోర్ అవసరం ఉన్నదని సిబ్బంది తెలుపగ బోర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ,  గ్రంధాలయంలో గ్రూప్స్, డి.ఎస్.సి కి ఉపయోగ పడే పుస్తకాలు  విద్యార్థిని విద్యార్థుల కోరిన విధంగా  అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు. గ్రంధాలయాన్ని ఉదయం 8 నుండి అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలని   సూచించారు. గ్రంధాలయాన్ని శుభ్రంగా విద్యార్థులకు అన్ని వేళలలో అందుబాటులో ఉంటున్న గ్రంథాలయ ఉద్యోగులను కలెక్టర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సెక్రటరీ సీతారామశాస్త్రి, రంగారావు, శ్యామ్ సుందర్ రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love