
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు.మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ సమావేశ మందిరం లో మున్సిపల్ కమిషనర్లు ఆర్డీవోలు ఇంజనీరింగ్ అధికారుల స్పెషలాఫీషలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా అదనప కలెక్టర్ లోకల్ బాడీస్ సిహెచ్ మిషన్ భగీరథ ఎస్సీ వెంకటేశ్వర్లు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్య త్రాగు నీటి సమస్య తలత్తె అవకాశం ఉందని, రాగల 15 రోజులు అధికారులు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు. స్పెషల్ అధికారులు మున్సిపాలిటీ పరిధిలో వారికి కేటాయించిన వార్డుల ప్రకారం ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల అభిప్రాయాలను స్వీకరించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. మట్టపల్లి, కృష్ణాపురం డబ్ల్యూ టిపీల ద్వారా 90 ఆవాసాల గ్రామాలకు త్రాగునీటి సరఫరాకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నియోజకవర్గాల వారీగా త్రాగునీటి సరఫరా గురించి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత వల్ల నీటి ఎద్దడి ఏర్పడినట్లయితే గ్రామాలలో ప్రత్యామ్నాయ చర్యల ద్వారా త్రాగునీటిని అందించాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. మిషన్ భగీరథ అధికారులు మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. అన్ని నియోజకవర్గాలలో త్రాగునీటి నిల్వల కొరకు శాశ్వత ఏర్పాట్ల పై నివేదికలు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాలకు ప్రతిరోజు నీటి సరఫరా జరిగేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక అధికారులు చిన్న చిన్న సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని రానున్న 15 రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు తాగునీరు అందే విధంగా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి సీఈవో వి వి అప్పారావు, సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవ్, కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ, హుజూర్నగర్ ఆర్డిఓ వి శ్రీనివాసులు, మిషన్ భగీరథ అధికారులు శ్రీనివాసరావు, అరుణాకర్ రెడ్డి, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, కోదాడ రమాదేవి, తిరుమలగిరి రామదుర్గారెడ్డి, హుజూర్నగర్ శ్రీనివాస్ రెడ్డి, నేరేడుచర్ల అశోక్ రెడ్డి, ఆర్టీవో సురేష్ కుమార్ మున్సిపల్ ప్రత్యేక అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.