– డా.హిప్నో పద్మా కమలాకర్, బి.సరోజని రామారావు
నవతెలంగాణ – హైదరాబాద్: హోలీ పండుగ తో కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, బి.సరోజని రామారావు, జ్యోతి రాజా అన్నారు. ఇందిరా పార్క్ లో యోగా గురు బొబ్బిలి సరోజని రామారావు ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి.రామారావు, డా.గీత, జ్యోతి రాజా, శోభా రాణి, పూర్ణ కుమారి, వాణిశ్రీ సుజాత, శ్రీలత, రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వరరావు, యశోద, ప్రకాష్, సరస్వతి, హిత,హరిత, రాజా నరసింహ, యోగా సాధకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ హోలీ చుట్టూ ఉండే వారి పట్ల ప్రేమ, విశ్వాసం అవగాహన కలిగిస్తాయి న్నారు. తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం వల్ల ఎండ తీవ్రతను తట్టుకొ గలరన్నారు. పైగా రంగుల పండగ… వర్ణాలన్నీ దుస్తులపై కనిపిస్తే ఇంద్రధనుస్సులా అధ్బుతంగా ఉంటుందన్నారు. అందుకే తెలుపు దుస్తులు ధరిస్తారని తెలిపారు. రంగులు అన్ని ఎమోషన్స్ ని తెలుపుతాయి న్నారు. ఆనందాలను, అనుబంధాలను కలిసి మెలిసి ఉండేలా చేస్తుందన్నారు. మరో హోలీ వరకూ ఈ మధురానుభూతులను పదిలంగా ఉంచుకోండి.అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపుతుంది న్నారు . మూగ జీవాలు పై రంగులు వేయకూడదని చెప్పారు. ప్రకృతి సహజమైన రంగులతోనే హోలీని జరుపుకోవాలన్నారు.