కమ్యూనిస్టుల ఐక్యత మహాసభకు తరలిరావాలి

–  సీపీఐఎంఎల్ ప్రజాప్రందా డివిజన్ కార్యదర్శి వీరన్న
నవతెలంగాణ – పెద్దవంగర
ఖమ్మం జిల్లాలో మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో జరిగే కమ్యూనిస్టు పార్టీల ఐక్యత మహాసభకు భారీ ఎత్తున తరలిరావాలని సీపీఐఎంఎల్ ప్రజాప్రందా తొర్రూరు డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముంజంపల్లి వీరన్న పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో ఆయన కమ్యూనిస్టుల ఐక్యత మహాసభ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం వీరన్న మాట్లాడుతూ.. దేశంలో పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజల పక్షాన నిలబడి వారి హక్కులకై పోరాడుతున్న కమ్యూనిస్టు విప్లవ పార్టీలను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ప్రజలందరి శ్రేయస్సుకై పాటుపడుతూ అనునిత్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దేశంలోని కమ్యూనిస్టు శక్తులని ఏకం కావాలని అన్నారు. తద్వారా బూర్జువా పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు తమతో సామాన్య ప్రజానీకం కూడా నడుం బిగించాలని కోరారు. అందులో భాగంగా సీపీఐ ఎంఎల్ ప్రజాపందా, పీసీసీ, సీపీఐ ఎంఎల్, ఆర్ఐ పార్టీలు ప్రజా సంఘాల విలీనమై సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీగా ఏర్పడుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో ఖమ్మంలో జరిగే కమ్యూనిస్టుల భారీ బహిరంగ సభకు ప్రజాస్వామ్యవాదులు, విప్లవ పార్టీ సానుభూతిపరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ సంయుక్త మండలాల కార్యదర్శి చింత నవీన్, బిక్షం, సంపత్ వెంకన్న, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love