భూమిని ఆక్రమించారంటూ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిపై ఫిర్యాదు

నవతెలంగాణ – హైదరాబాద్: ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి తన భూమిని ఆక్రమించారంటూ బాలీవుడ్ గాయకుడు లక్కీ అలీ ఫిర్యాదు చేశారు. రోహిణి సింధూరి కర్ణాటక కేడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారిణి. బెంగళూరు శివారు యెలహంకలోని తన వ్యవసాయ భూమిని రోహిణి, ఆమె భర్త సుధీర్ రెడ్డి, బంధువు మధుసూదన్ రెడ్డి అక్రమంగా లాక్కున్నారని లక్కీ అలీ ఆరోపించారు. ఇందుకు కొంతమంది స్థానిక పోలీసు అధికారులు ఆమెకు సహకరించారని ఆరోపించారు. దీనిపై తాను 2022లోనే కేసు పెట్టానని… కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో తాను లోకాయుక్తను ఆశ్రయించినట్లు చెప్పారు. లక్కీ అలీ ఫిర్యాదుతో యెలహంక న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

Spread the love