– పౌష్టికాహారంతో రక్తహీనత దూరం
– ఐసీడీఎస్ సూపర్‌వైజర్ తిరుమల, కవిత
నవతెలంగాణ-తలకొండపల్లి
మండల పరిధిలోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సమతుల ఆహారం తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని ఐసీ డీఎస్ సూపర్‌వైజర్లు తిరుమల, కవిత అన్నారు. మంగళవారం పౌష్టికాహారం వారోత్సవాల్లో భాగంగా తలకొండపల్లి మండల పరిధిలోని వెల్జాల్ సెక్టార్‌లోని రాంపూర్, చుక్కాపూర్ సెక్టార్‌లోని చెన్నారం గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్స్ ఆధ్వర్యంలో గర్భిణులకు, బాలింతలకు రక్తహీన వల్ల కలిగే నష్టాలపై, వివరించి, పౌష్టికాహారం తీసుకో వడంతోనే ఆరోగ్యంగా ఉండవచ్చని వారికి అవగాహన కల్పించారు. పౌష్ట్టికాహారం, పోషణ్ పక్వాడ, బాలామృతంపై అవ గాహనా కార్య క్రమంలో ముఖ్య అతిథులుగా వారు పాల్గొన్ని మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు చిరు ధాన్యాలు, పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. చిన్న పిల్లలకు బాలమృతంలో ఉండే పోషక విలువల గురించి కూడా ఏ మోతాదులో తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి తెలియజేసినట్టు వెల్ల డించారు. అంతేకాకుండా విటమిన్స్, ఐరన్ మాత్రలు వేసుకుంటే, రక్తహీనత నుంచి దూరం కావచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్లు పద్మ, లక్ష్మి, అనంతమ్మ గర్భిణులు, బాలింతలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అనిత, సరస్వతి, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.