కాంగ్రెస్ తోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి 

– కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు 
నవతెలంగాణ – నెల్లికుదురు 
కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అన్ని రంగాలుగా సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది అని వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏదేళ్ల యాదవ రెడ్డి గుగులోతు బాలాజీ నాయక్ నాయిని సత్యపాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు కాసం  లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పార్వతమ్మ గూడెం నైనాల రత్తిరాంతండ నల్లగుట్ట తండా గ్రామంలో మండల శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ ఆ గ్రామ కార్యకర్తలతో కలిసి ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను గెలిపించాలని శనివారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధి చెందిందని తెలిపారు పదేళ్లు పాలించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు పేదల అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు కనీసం పేదల సమస్య మీద కూడా ఎక్కడ మాట్లాడిన దాఖలు లేవని ఆవేదన వ్యక్తం చెందారు. అందుకోసమే ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీని పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నిటిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఇప్పటికే కొన్నిటిని అమలు చేసిందని తెలిపారు. తక్కువ సమయం లో ఎక్కువ హామీలు అమలు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి దక్కిందని అన్నారు. రానున్న రోజుల్లో గ్రామాలలో ప్రతి వీధిలో సమస్యను గుర్తించి ప్రతి ఒక్కరి బాధను అర్థం చేసుకొని ఆ గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గెలిస్తే కేంద్రంలో తప్పకుండా కేంద్ర మంత్రి పదవి వస్తుందని అన్నారు. అంతేకాకుండా దేశానికి రాహుల్ గాంధీని ప్రధాని చేసినట్లు అని అన్నారు దీంతో ఈ ప్రాంతం పూర్తిస్థాయిలో అభివృద్ధి జరిగి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చెందారు. ఇప్పటికే మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ గ్రామ గ్రామాలన తిరిగి వారి సమస్యలను గుర్తిస్తున్నారని త్వరలోనే మహబూబాబాద్ ను బంగారు మహబూబాబాద్ గ తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మరియు ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ ఎల్లారెడ్డి జాగిరి యాకసైలు భాస్కర్ దేవేందర్ వెంకన్న సురేష్ తోట యాకయ్య ఏర్పుల మహేందర్ పట్నం శెట్టి నాగరాజు కుమ్మరి కుంట్ల మౌనేందర్ ఆ గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love