ముగిసిన శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర మహోత్సవాలు

Concluded Sri Ujjain Mahankali Bonala Jatara Mahotsavam– అమ్మవారిని దర్శించుకున్న వేములవాడ ఏ ఎస్ పి శేషాద్రిని రెడ్డి..
నవతెలంగాణ – వేములవాడ 
అశాడ మాసం పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర మహోత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. చివరి రోజు సోమవారం మహంకాళీ అమ్మవారికి పుష్పాభిషేకం చేసి ప్రత్యేక పూజలు గావించారు, వేములవాడ ఏ ఎస్ పి శేషాద్రిని రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయ నిర్వాహకులు శేష వస్త్రం కప్పి సన్మానించారు. అమ్మవారికి మంగళహారతి సమర్పించి జాతర మహోత్సవాలను ఘనంగా ముగింపజేశారు.బోనాల జాతరలో భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఛైర్మన్ మహంకాళి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక శ్రద్ధ వహించారు.ఉత్సవాలలో భాగంగా విజయవాడకు చెందిన ప్రభ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన వైవిధ్యమైన వేషధారణలు,సాంసృతిక కార్యక్రమాలు పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా గొర్రె పొట్టేళ్ళు,తొట్టెండ్లు,పలహార బండ్లు,పోతరాజుల విన్యాసాలు,నృత్యాలతో డప్పు వాయిద్యాల మధ్య ఉజ్జయిని మహంకాళీ అమ్మవారు పట్టణ పురవిధుల గుండా ఊరేగింపుతో వెళ్లి భక్తులకు దర్శనమిచ్చారు.మూడు రోజుల పాటు కన్నుల పండువగా నిర్వహించిన  అమ్మవారి బోనాల జాతర మహోత్సవాలలో ప్రభుత్వ విప్,స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,బిజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ,మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఏనుగు మనోహర్ రెడ్డి లతో పాటు స్థానిక కౌన్సిలర్లు,నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.అమ్మవారి బోనాల ఉత్సవాలను తిలకించడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పట్టణ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.అమ్మవారి  ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో మహిళలు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love