సమాచారహక్కు వికాస సమితిలో సభ్యులుగా చేరిన వారికి అభినందనలు

– నేను, నాతో నా వెంట 10 మంది పౌర అక్షర సైన్యం
నవతెలంగాణ – పెద్దవూర
సమాచార హక్కు వికాస సమితి లో సభ్యులు గా చేరిన వారికి అభినందనలు తెలుపుతున్నామని సమాచార హక్కు వికాస సమితి వ్యవస్తాపక అధ్యక్షులు యారమాద కృష్ణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చేరిన ప్రతి సభ్యుడు నాతో పది మంది పౌరులను పౌర సైనికులుగా
ఉచిత శిక్షణ ఇప్పించడంతో పాటు వారికి ఐడికార్డులు, మండల కమిటీ, నియోజక వర్గ కమిటీ, జిల్లా కమిటీల్లో వివిధ హోదాలో వారి వయస్సు, అనుభవం, వృత్తిని బట్టి, ఆసక్తిని బట్టి, వారిని పై హోదాల్లో నియమించి, నియామక పత్రాలు ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాలలో గల కమిటీల సభ్యులతో జిల్లాల వారీగా ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ లు, జిల్లాల వాట్సాప్ గ్రూప్ లో నూతన సభ్యుల సెల్ నెంబర్లను జిల్లా అధ్యక్షులు చే గ్రూపులో యాడ్ చేయబడునని తెలిపారు. అవినీతి అక్రమాలపై అక్షరాలే అస్ట్రాలుగా, చట్టాలు – హక్కులు ఆయుధాలుగా ప్రజాస్వామ్య విధానంలోని పోరాట పద్దతులను అనుసరించాలని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రక్షణ కోసం సంక్షేమ పథకాల్లో అర్హుల ఎంపిక కోసం, ఆభివృద్ది పనుల్లో నాణ్యత కోసం పునాదులు వేయాలని అన్నారు.
మీ జిల్లా కేంద్రంలో మార్చ్1నుండి30 తేదీల మధ్య తేదీల్లో ఒకరోజు శిక్షణ తేదీ,స్థలం, సమయం, శిక్షణ ఇచ్చే ప్రముఖుల వివరాలు,తెలియ జెస్తామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు యజమానిగా పైసా ఖర్చు లేకుండా, పౌరుల పనికి ఆటంకం కాకుండా, సుపరిపాలన కోసం పని చేయాలని కోరారు. సమాచార హక్కు వికాస సమితి ద్వారా ఆసక్తి వున్న వారికి ఒకరోజు శిక్షణ ఇవ్వడానికి మీ జిల్లాకు వస్తున్నామని, మీరు ఒకరోజు శిక్షణలో పాల్గొనడంతో పాటు, మీ ద్వారా 10 మందిని శిక్షణకు హాజరు అయ్యేలా చూడాలని తెలిపారు. రాజకీయ పార్టీలకు సంబంధంలేకుండా మీ విలువైన సమయంలో ఒకరోజు మీ జిల్లాలో ఇచ్చే శిక్షణలో పాల్గొనండని పిలువు నీచ్చారు. ఫిబ్రవరి 6 నుండి 20 తేదీ లోపు సమాచార హక్కు వికాస సమితి లో సభ్యత్వం రూ.200 లు చెల్లించిన వారికి నియామక పత్రాలు మీ జిల్లాలో శిక్షణ ఇచ్చిన రోజు ప్రముఖుల చేతుల మీదుగా ఇప్పించవడునని తెలిపారు. సభ్యులు గా చేరడానికి ఆసక్తిగల వారు మీ పేరు,జిల్లా పేరు, పూర్తి చిరునామా, పుట్టిన తేది, వృత్తి తెలియజేసి, సభ్యత్వ రుసుము రూ.200 లుచెల్లించాలని తెలిపారు.

Spread the love