కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.

Congress aims to make crore women millionaires.– రేగ కళ్యాణి కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షురాలు
నవ తెలంగాణ-గోవిందరావుపేట
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రేగా కళ్యాణి అన్నారు. శుక్రవారం మండల కేంద్రం తోపాటు పస్ర మరియు రాఘవ పట్నం గ్రామంలో మహిళ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు మద్దాలి నాగమణి ఆధ్వర్యంలో ఎ.ఐ.ఎం.సి మహిళ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగా కళ్యాణి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలకు అండ, అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళల పట్ల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది మహిళలందరూ సభ్యత్వ నమోదు పక్రియలో ఆసక్తి చూపించి సభ్యత్వం పొందాలని కోరారు . మహిళలను అభివృద్ధి చేయాలనే కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తుంది,మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కుటుంబాలకు మహిళ సంఘాలకు కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. అలాగే గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్,మహిళలకు ప్రతి నెల 2500/- రూపాయలు అందించి మహిళలను అభివృద్ధి చేస్తుంది,మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు,త్వరలో ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేస్తారని కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలకు అండ మహిళలందరూ తప్పకుండా అఖిల భారత మహిళా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల అనుబంధ సంఘాల మహిళలు, మరియు కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు, మరియు మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్దం లింగారెడ్డీ, పులుగుజ్జు వెంకన్న , పెండేం శ్రీకాంత్, కోరం రామ్మోహన్ మరియు తదితర ముఖ్య నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు

Spread the love