కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లే పొత్తులకు పిలిచాయి

– కేసిఆర్‌ బీజేపికి భయపడి వెనకడుగు వేస్తే కాంగ్రెస్‌కు చిత్తశుద్దిలేదు
– ఎవరితో పొత్తులు లేవు ఒంటరిగానే సీపీఐ(ఎం) 19 స్థానాల్లో పోటీ
– గత వైభవాన్ని పునర్మిద్ధాం… పట్టుదలతో పనిచేయండి
– శ్రేణులంతా ఒక్క ఓటు మిస్‌ కాకుండా వేసి ఇతరులతో వేయించాలి
– ఆశయాలు కలిగిన దుగ్గి కృష్ణను గెలిపించాలి
– సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-ఇల్లందు
ప్రవేటీకరణ,కార్బోరేటీకరణలో దూసుకెళుతు మత రాజకీయాలతో దేశాన్ని అన్ని రంగాల్గొ దేశాన్ని బీజేపి బ్రష్టుపట్టిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు విమర్శించారు. దీన్ని ఎదుర్కొవాలని కాంగ్రేస్‌ పార్టీయే పొత్తులకు ఆహ్వానించిందన్నారు. వారే ఇచ్చిన మాట తప్పారని పొత్తుల పట్ల వారికి చిత్తశుద్ధి లేదన్నారు.మునుగోడు ఎన్నికల్లొ వామపక్షల సహాయంతో గెలిచిన బీఆర్‌ఎస్‌ పార్టీ తొలుత పొత్తులు ఉంటాయని చెప్పి కేసిఆర్‌ బీజేపికి భయపడి వెకడుగువేశారని అన్నారు. దీని మూలంగా ఒకంటరిగానే సిపిఎం పార్టీ బరిలోకి దిగాల్సి వచ్చిందన్నారు. కొత్తగూడెంలో సిపిఐ పార్టీకి మద్దతు ఇస్తునన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సిపిఎం పార్టీ 19 స్దానాల్గొ పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 1952 నుండి కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఇల్లందు గత వైభవాన్ని పునర్మిధ్దామని ప్రతి ఒక్కరూ పట్టుదలతో పనిచేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్దానిక ఏలూరి భవన్‌లో సోమవారం ఖమ్మం,కొత్తగూడెం,మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శులు,ఇల్లందు,కామేపల్లి,టేకులపల్లి,గార్ల,బయ్యారం మండలాల కార్యదర్శులు,పార్టీ బాధ్యులు,ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మాట్లాడారు. గతంలో పిడిఎఫ్‌ తరపున సిపిఎం అభ్యర్ధి కెఎల్‌ నర్సింహారావు రెండు విడతలు ఎంఎల్‌ఏగా గెలుపొందారని, కంగల బుచ్చయ్య , 1983లో స్వర్గీయ గుగులోత్‌ ధర్నా కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారని అన్నారు. 30ఏండ్ల అనంతరం 2023 అసెంబ్లి ఎన్నికల్లో ఉన్నతమైన ఆశయాలు కలిగిన దుగ్గి కృష్ణ సిపిఎం అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం,కొత్తగూడెం,మహబూబాబాద్‌ జిల్లాల కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు,అన్నవరపు కనయ్య,సాధుల శ్రీనివాసరావు,రాష్ట్ర నేత పి.రాజారావు, జిల్లా కమిటి సభ్యులు నబి,రేపాలకు శ్రీను,మండా రాజన్న,గార్ల,బయ్యారం,ఇల్లందు,కామేపల్లి,టేకులపల్లి మండలాల కార్యదర్శులు నేతలు జిల్లా నేతలు కూకట్ల శంకర్‌,కుంట ఉపేందర్‌, బాదావత్‌ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఛాలెంజ్‌గా తీసుకోవాలి స్పీడ్‌ పెంచి ధీటుగా పనిచేయాలి
ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
అసెబ్లి ఎన్నికల్గొ సిపిఎం అభ్యర్ధిని గెలిపించడాన్ని ఛాలెంజ్‌గా తీసుకోవాలి స్పీడ్‌ పెంచి ధీటుగా పనిచేయాలని ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గతంలో నియోజవర్గలంలోని కామేపల్లి, గార్ల, బయ్యారం, టేకుపల్లి, ఇల్లందులో మున్సిపల్‌ ఛైర్మన్‌, సర్పంచ్‌లు, ఎంపిటీసిలు, జెడ్‌పిటీసిలు గెలిపించుకున్న చరిత్ర ఉందన్నారు. కాంగ్రేస్‌, బీఆర్‌ఎస్‌లో గృపుల లొల్లి ఉందని ఓట్లు క్రాస్‌ అయ్యే అవకాశం ఉన్నందున అవి సిపిఎంకు పడే విధంగా శ్రేణులు కృషి చేయాలన్నారు. ఇది ఒక ఉద్యమంగా తీసుకో వాలన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌తో తపడు తూ సిపిఎం పార్టీ త్రిముఖ పోటీ ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా ఎన్నొ ఉద్యమాలు చేసి పోరాట పటిమ ఉన్న పార్టీ సిపిఎం అని ముందు పీఠిన నిలబెట్టాల్సిన బాద్యత అందరిపై ఉందన్నారు.
ఇంటింటి ప్రచారం చేయాలి
మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాసరావు
రాష్ట్రం, జిల్లా, నియోజవర్గాల్లొ కమ్యూనిస్టుల శక్తి పెంచాలని సీపీఐ(ఎం) మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు. బూర్జువా పార్టీలు మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. 2014లో నీళ్ళు నిధులు నియామకాలతో గద్దెనెక్కిన కేసిఆర్‌ పదవి పవర్‌ రుచి మరిగారని మరోసారి గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వారికి అవసరం ఉన్నప్పుడే కమ్యూనిస్టులు గుర్తొస్తారని అన్నారు. జనంలోకి ధైర్యంగా వెళ్ళాలని, ఎన్నిక ష్టాలు వచ్చినా ఎదుర్కొవాలన్నారు. సిపిఎం పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని గత పార్టీల పాలనలో ఎం జరిగిందో ప్రజలు, ప్రాంతాలు ఎలా నష్టపోయాయో వివరించాలన్నారు. సిపిఎం మ్యానిఫెస్టోను విరివిగా ప్రచారం చేయాలన్నారు.
అధికార పక్షాన్ని నిలదీసి సమస్యలు సాధించడానికి దుగ్గి కృష్ణను గెలిపించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే ప్రభుత్వం సక్రమంగా విధులు నిర్వహిస్తుందని అధికార పక్షాన్ని నిలదీసి సమస్యలు సాధించడానికి దుగ్గి కృష్ణను గెలిపించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. స్దానిక ఏలూరి భవన్‌లో జరిగి సమావేశంలో మాట్లాడారు. సిపిఎం పార్టీ బలం పెంచుకోవాల్సిన అసరం ఉందన్నారు. స్దానిక నేతలు ఓటర్లను కలుసుకుని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఓట్ల శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలన్నారు.
దశాబ్దాల చరిత్ర బొందల గడ్డగా మార్చారు
బొగ్గుగనులను నిర్వీర్యం చేస్తు ప్రవేటీకారణకు పాల్పడుతున్న పార్టీలను ఓడించాలి
సిఐటియు రాష్ట్ర గౌరవాద్యక్షులు పి.రాజారావు
సింగరేణిలో బొగ్గుగనుల ప్రయివేటీకరకు పూను కూంటూ నిర్వీర్యం చేస్తున్న పార్టీలను ఓడించాలని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూని యన్‌(సిఐటియు) రాష్ట్ర గౌరవాద్యక్షులు, ఇల్లందు సిపిఎం పార్టీ నిర్మాతల్లో ఒకరైన పి.రాజారావు అన్నారు. 150 ఏండ్ల చరిత్ర కలిని ఇల్లందులో బొగ్గుగనులు అంతరించాయన్నారు. ఓసిలతో బొందల గడ్డగా మార్చారని అన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారని అన్నారు. బొగ్గు బ్లాకులు ప్రయివేటకు ఇచ్చిన బీజేపి తీరును దుయ్యబట్టారు. ఇదే బాటలో గతంలో కేసిఆర్‌ కూడ ఉన్నారని బీజేపి విధనాలకు వంతపాడుతు ప్రయివేటీకరణుకు మద్దతు పటకడం దారుణమన్నారు.

Spread the love