డిగ్రీ ప్రధమ సంవత్సర ప్రవేశాల కౌన్సిలింగ్ కు ఆహ్వానం

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్ట్ సమీపంలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల(దమ్మపేట) నందు డిగ్రీ ప్రధమ సంవత్సరం మొదటి దఫా లో ఎంపికైన విద్యార్ధినులు కౌన్సిలింగ్ ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.రోజా శనివారం తెలిపారు. గ్రూపులు : ఎం.పి.సి.ఎస్,(MPCs),బి.ఎ.సి(BAC),బి.ఎ(BA),బి.కామ్ సి.ఎ(B.Com CA)గ్రూపుల లో ప్రవేశానికి అర్హత సాధించిన విద్యార్థినిలు కౌన్సిలింగ్ హాజరు అయ్యే సమయంలో కళాశాలకు తీసుకురావలసిన అసలు దృవీకరణ పత్రాలు : పదో తరగతి,ఇంటర్ మార్కుల జాబితా ఇంటర్,టి.జి.యు.జి సెట్ హాల్ టికెట్స్,కుల,ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, 5 వ తరగతి నుండి 10 వ, తరగతి వరకు స్టడీ, కండక్ట్ దృవీకరణ పత్రాలు, పాస్ పోర్ట్ ఫొటోస్ – 5 తో 01- 06 – 2023 నుండి 12 – 06 – 2023). వరకు కళాశాలలో సంప్రదించాలని వారు కోరారు. అలాగే సిరిసిల్ల లో గల టి.టి.డబ్ల్యు. ఆర్.డి.సి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ,నాగర్ కర్నూల్ లో గల టి.టి.డబ్ల్యు. ఆర్.డి.సి(,ఎం), షాద్ నగర్ గల టి.టి.డబ్ల్యు. ఆర్.డి.సి(డబ్ల్యు)  కళాశాలలో ఎం.ఎస్.సి ప్రవేశాలు కల్పిస్తున్నాయని తెలిపారు.

Spread the love