ఏకలవ్య ఆదర్శ పాఠశాల గాంధారిలో 29న స్పాట్ అడ్మిషన్లు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఏకలవ్య ఆదర్శ పాఠశాల గాంధారిలో 29న స్పాట్ అడ్మిషన్లు.. నిర్వహిస్తున్న మని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థుల ఏకలవ్య ఆదర్శ పాఠశాల ఇందల్వాయిలో ఎంపిసి, బిఐపిసి,సిఈసి గ్రూపులలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు ఈనెల 29న స్పాట్ అడ్మిషన్లు ఏకలవ్య ఆదర్శ పాఠశాల గాంధారిలో నిర్వహిస్తున్నామని అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏకలవ్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ యొక్క ప్రత్యేకతలు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి నిష్ణాతులైన అధ్యాపకులచే ఐఐటి, నెట్ కోచింగ్ ఇవ్వబడుతుందని, విద్యార్థులకు ఎల్ సి డి ప్రొజెక్టర్ ద్వారా విద్యా బోధన నిర్వహించబడుతుందని వివరించారు.అధునాతన నూతన ప్రయోగశాల, నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన,విద్యార్థులకు సులభంగా ఇంగ్లీషులో మాట్లాడడానికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లులు నిర్వహించబడుతుందని తెలిపారు.విద్యార్థులకు ఉదయం 5 గంటల నుండి మానసిక ఉల్లాసానికి మంచి ఆరోగ్యాన్ని వ్యాయామాన్ని క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు పిఈటి,పిడి లా ఆధ్వర్యంలో నిర్వహణా, మారినవిద్య విధానానికి అనుగుణంగా కాన్సెప్ట్ అండర్ పద్ధతిలో విద్యాబోధన, ప్రత్యేకమైన కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మరియు లైబ్రరీ సదుపాయం ,నాణ్యమైన భోజన సౌకర్యం, హాస్టల్ వసతి డిజిటల్ క్లాసులు, 24&7 జిఎన్ఎం సేవలు, చిన్నారులను ఏకలవ్య ఆదర్శ పాఠశాల ఇందల్వాయిలో చేర్పించి వారి బంగారు భవితకు బాటలు వేయాలని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కోరారు.

Spread the love