నవతెలంగాణ – ఆలేరు రూరల్
భైరాంనగర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంపరాజు వెంకటేశ్వరరాజును గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధి దిశగా సమిష్టిగా ముందుకు సాగాలనే సంకల్పంతో,పలువురు నాయకులు మరియు గ్రామ పెద్దల సమన్వయంతో ప్రజలు ఏకమై ఆయనకు తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికి వెంకటేశ్వరరాజు ధన్యవాదాలు తెలిపారు. తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలేరు ఎంపీపీ పార్టీ అభ్యర్థి గంధమల్ల అశోక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్ల రాజు,కొలనుపాక గ్రామ శాఖ అధ్యక్షులు గొట్టం విజయేందర్, ఇ మ్రాన్ ఖాన్,గాదే సోమిరెడ్డి,బండపల్లి మహేష్,చాడ రాజు,భద్రం రాజు,సత్యం రాజు తదితరులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భైరాంనగర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం
- Advertisement -
- Advertisement -



