లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ అవగాహన

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ అవగాహన– సీఎంతో సీపీఐ నేతల సమావేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డితో సీపీఐ ప్రతినిధి బృందం మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సమావేశమైంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శులు కె నారాయణ, అజీజ్‌ పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, టి శ్రీనివాసరావు, ఎన్‌ బాలమల్లేష్‌, బాల నర్సింహ్మ, బాగం హేమం తరావు, కలవేన శంకర్‌, ఈటి నరసింహ తదితరులు సీఎంను కలిసి నూతన సంవ త్సర శుభాకాంక్షలు తెలి పారు. అసెంబ్లీ ఎన్ని కల్లో కాం గ్రెస్‌, సీపీఐ అవగా హన సత్ఫ లితాలను ఇచ్చిం దని సీఎంతో సీపీఐ నేతలు అన్నారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్‌, సీపీఐ రాష్ట్రంలో అవగాహనతో పోటీ చేసేం దుకు పరస్పరం సహక రించుకో వాలని కోరారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రజాసమ స్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సీఎంను మరోసారి కలవాలని నిర్ణయించుకున్నామని కూనంనేని అన్నారు.
న్యాయ విచారణ పరిధిలో సింగరేణిని చేర్చాలి
ప్రభుత్వరంగ సంస్థలను కాపాడ్డంతోపాటు వాటిని పటిష్టపరచాలని సీఎంకు సీపీఐ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. విద్యుత్‌ రంగంలో అక్రమాలపై న్యాయ విచారణ జరుపుతామంటూ సీఎం ప్రకటించారని గుర్తు చేసింది. సింగరేణి కాలరీస్‌ సంస్థలో జరిగిన అక్రమాలు, అవినీతిని కూడా న్యాయ విచారణ పరిధిలోకి తేవాలని కూనంనేని కోరారు. సింగరేణి, జెన్‌కో, ట్రాన్స్‌కోకు సమర్థులైన అధికారులను నియమించాలని సూచించారు.
అందరికీ అందుబాటులో ఉంటా : సీఎం
అందరికీ అందుబాటులో ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాసంఘాలు, పార్టీలు ప్రజా సమస్యలపై ప్రాతినిధ్యం చేసేందుకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటానని వివరించారు. వివిధ సంస్థలు, శాఖల్లో రిటైర్డ్‌ అధికారులను ఏండ్ల తరబడి కొనసాగించారనీ, ఆ సంప్రదాయానికి కొత్త ప్రభుత్వం స్వస్తి పలకాలని నారాయణ సూచించారు.

Spread the love