ఘనంగా కాంగ్రెస్ పార్టీ  జిల్లా నాయకుడి జన్మదిన వేడుక 

నవతెలంగాణ- నెల్లికుదురు: మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కాసం రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కాసం రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్ తో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకునే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో పుట్టినరోజు సందర్భంగా టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ గౌడ్ మల్లేశం సత్యపాల్ రెడ్డి చిన్న లక్ష్మారెడ్డి చిన్నబోయిన శ్రీనివాస్ పిట్టల మురళి మల్లేశం జల సోమయ్య తోపాటు కొంతమంది పాల్గొన్నారు.

Spread the love