– డీసీసీ ఉపాధ్యక్షుడు బొలుసాని భీంరెడ్డి
– బ్లాక్ బి అధ్యక్షుడు కర్రే భరత్ కుమార్
– కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు
– చాపలగూడెంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరిక
నవతెలంగాణ-కుల్కచర్ల
పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని డీసీసీ ఉపాధ్యక్షుడు బొలుసాని భీంరెడ్డి, బ్లాక్ బి.అధ్యక్షుడు భారత్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆంజనేయు లు ముదిరాజ్ అన్నారు. ఆదివారం కుల్కచర్ల మండలం చాపలగూడెం గ్రామంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గెలుపునకు ఇంటింటికి తిరిగి 6 గ్యారెంటీ పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వ హించారు. అంతకుముందు కాంగ్రెస్ జిల్లా నాయకుడు కుమ్మరి స్వామి ఆధ్వర్యంలో గ్రామ ఉపసర్పంచ్ పద్మమ్మ, ఇద్దరు వార్డు సభ్యులు, పలు పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. అనంతరం వారు మాట్లాడారు…6 గ్యారెంటీ పథ కాలను చూసి గ్రామాల్లోని ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతున్నారని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అంతారం సర్పంచ్ కృష్ణ య్య, కాంగ్రెస్ నాయకులు కనకం మొగులయ్య, వినోద్, బీసీ సెల్ నాయకుడు ఐలగారి కృష్ణయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, తుప్పలి వెంకటేష్, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వార్డు సభ్యులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.