‘కాంగ్రెస్‌ గెలుపు ఖాయం’

నవతెలంగాణ-పరిగి
కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘గడప గడపకూ కాంగ్రెస్‌- పల్లె పల్లెకు రామ్మోహన్‌ అన్న’ అనే నినాదంతో గురువారం పరిగి మండలం నజీరాబాద్‌, హనుమాన్‌ గండి, రంగాపూర్‌ తండా, రంగాపూర్‌, బసిరెడ్డిపల్లి, మాదారం, పేట మాదారం, పోల్కంపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా గడపగడపకూ తిరుగుతూ ఆరు గ్యారెంటీ పథ కాల గురించి వివరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్‌ను గెలిపించా లని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు లా ల్‌కృష్ణప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్‌, పార్టీ మండల అధ్యక్షుడు భూమనగారి పరశురాంరెడ్డి, పరిగి పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, పార్టీ నాయ కులు చిన్న నర్సింలు, పాలాద్రి శ్రీను, అనేం ఆంజనేయులు, నజీర్‌ భరు, సర్పంచ్లు వెంకట్రాంరెడ్డి, పెంటయ్య, రాజపుల్లారెడ్డి, హర్షద్‌, షాయబ్‌, నాగవర్ధన్‌, రామకృష్ణరెడ్డి, గణేష్‌ పాల్గొన్నారు.

Spread the love