Monday, August 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి బీమా చెక్కు అందజేత

‌కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి బీమా చెక్కు అందజేత

- Advertisement -


డీజీపీ సీవీ ఆనంద్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌

విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ ‌రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అతని కుటుంబానికి రూ.కోటి బీమా చెక్కును రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ సోమవారం హైదరాబాద్‌‌లో అందజేశారు. గతంలో మల్కాజ్‌‌గిరి పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో ఏఆర్‌ కానిస్టేబుల్‌‌గా ఉన్న చరణ్‌ ఈగల్‌ ‌ఫోర్స్‌‌లో డిప్యూటేషన్‌‌పై పనిచేస్తున్నారు. ఆయన డ్రగ్స్‌ ‌ముఠాను పట్టుకోవడానికి మహారాష్ట్ర వెళ్లిన సందర్భంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చరణ్‌ ‌మరణించారు. ఆయనకు స్టేట్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా చేసిన ఇన్సురెన్స్‌తో లభించిన రూ.కోటి బీమా చెక్కును డీజీపీ ఆనంద్‌ అందజేశారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఈగల్‌ ‌ఫోర్స్‌కు చెందిన ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -