Monday, August 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంశ్మశాన స్థలం దక్కేంత వరకు పోరాటం

శ్మశాన స్థలం దక్కేంత వరకు పోరాటం

- Advertisement -

నాగళ్ల ఇజ్రాయిల్‌
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్

సమాధుల స్థలం కోసం గత 50 ఏండ్ల నుంచి అడుగుతున్నా ప్రభుత్వాల నుంచి తగినంత స్పందన లేదని మార్టిన్ లూథర్ కాన్సెప్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగళ్ల ఇజ్రాయిల్‌ విమర్శించారు. హైదరాబాద్ లో నాంపల్లి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రైస్తవ సంఘ కాపరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రైస్తవుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లోని నాంపల్లి, ఖైరతాబాద్, కార్వాన్, గోషామహల్, మలక్ పేట్, అంబర్ పేట్, జూబ్లిహిల్స్ తదితర నియోజకవర్గాల్లో సమాధుల స్థలాలు లేవని ఆయన తెలిపారు. క్రైస్తవులు మరణించిన సమయంలో ఇతరుల స్మశాన వాటికల్లో వారికి చోటు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమావేశంలో పలువురు పాస్టర్లు సమాధుల స్థలం లేకపోవడంతో తమకు ఎదురైన అనుభవాలను వివరించారు. ఈ సమస్యపై త్వరలోనే రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ తో పాటు క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ చైర్మెన్ దీపక్ జాన్ లను కలిసి సమాధుల స్థలం సమస్యలను వారి దృష్టికి తేవాలని నిర్ణయించారు. త్వరలోనే ఏడు నియోజకవర్గాల పాస్టర్స్ ఫెలోషిప్పుల ఉమ్మడి సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో నాంపల్లి పాస్టర్స్ ఫెలోషిప్ పాస్టర్ దిలీప్, ప్రధాన కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ ఏ.జైపాల్, కో ఆర్డినేటర్ బి.అశోక్, కార్వాన్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రధాన కార్యదర్శి పాస్టర్ రాజ్ కుమార్, నాయకులు తిమోతి, ఖైరతాబాద్ నియోజకవర్గం పాస్టర్స్ ఫెల్లోషిప్ నాయకులు టి.ప్రభుదాస్, మార్టిన్ లూథర్ కాన్సెప్ట్ ఫౌండేషన్ నాయకులు ఎం.వి.జాన్సన్, సామ్యేల్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -