Sunday, August 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విషాదంలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ పూర్ణాచారి

విషాదంలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ పూర్ణాచారి

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల మున్సిపల్ పరిధిలోని మాదారం గ్రామంలో వరుస విషాదాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ కుటుంబానికి 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి అండగా నిలిచారు. కుటుంబ పెద్ద మృతి చెందగా, ఆ బాధ నుంచి కోలుకోకముందే కుమారుడు ప్రమాదానికి గురై శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. శస్త్రచికిత్స జరిగిన కేవలం 15 రోజుల్లోనే కుటుంబంలోని తల్లి ఆరేపల్లి ఓదెమ్మ మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వరుస ఘటనలతో ఆ కుటుంబం ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.

ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి ఆదివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి బియ్యం, నిత్యావసర సరుకులను అందజేసి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మృతురాలి కుమారుడు ఆరేపల్లి కుమార్‌తో పాటు దాసరి రవి, దుబాసి సహదేవ్, ఖ్యాతం రమేష్, కన్నం సుధాకర్, సుధామల్ల కిషోర్, మోరే ఓదెలు, చెరుకు వేణు, చెరుకు నాగరాజు, గూడెల్లి పైడి, అనిల్, పసుల ప్రశాంత్, తాటికాయల కిరణ్, పసుల రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -