కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేష్ కు పరామర్శ

నవతెలంగాణ –  పెద్దవంగర
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఇటీవల అనారోగ్యానికి గురై, ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో బీసీ సెల్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, యూత్ మండల ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్ ఆధ్వర్యంలో సురేష్ ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారి వెంట చిట్యాల యూత్ అధ్యక్షుడు మొగులగాని రజనీకాంత్, గ్రామ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నారబోయిన రామ్ చరణ్ తేజ్, మండల టౌన్ అధ్యక్షుడు అనపురం వినోద్ గౌడ్, కొయ్యడి ముఖేష్ గౌడ్, వల్లపు అరుణ్ కుమార్, శ్రీకాంత్, రాకేష్, సాయికుమార్, సుధీర్, వల్లపు మహేష్, ఉపేందర్ తదితరులు ఉన్నారు.
Spread the love