కౌంటింగ్ పనులను  పూర్తి ఏకాగ్రతతో నిర్వహించాలి..

– జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
కౌంటింగ్ పనులను పూర్తి ఏకాగ్రత్తతో నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. ఈ నెల 4 న స్థానిక అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో 14- భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గం సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన కౌంటింగ్ పనుల దృష్ట్యా శనివారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లకు పోస్టల్ బ్యాలెట్, ఇవిఎం కౌంటింగ్, ఇటిపిబిఎస్ కౌంటింగ్ విధులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రెండవ విడుత శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ నిర్వహణ పూర్తి ఏకాగ్రతతో నిర్వర్తించాలని, ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా కలెక్టరు వారికి సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె.గంగాధర్, జనగాం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు పింకేశ్ కుమార్, ఇబ్రహింపట్నం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కే.అనంతరెడ్డి, జిల్లా పరిషత్ సిఇఓ శోభారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి, కలెక్టరేటు పరిపాలన అధికారి జగన్మోహనప్రసాద్, జిల్లా లీడ్ మేనేజరు రామకృష్ణ, జిల్లా స్థాయి మాస్టం ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాధరెడ్డి లు పాల్గొన్నారు.
Spread the love