నవతెలంగాణ – వనపర్తి
సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై ఈడి దాడిని CPI(M) వనపర్తి పట్టణ కమిటీ ఖండించింది. సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సభ్యులు, 18వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్ అధ్యక్షుతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం, రాజు, సీపీఐ(ఎం) పార్టీ టౌన్ కార్యదర్శి పరమేశ్వర చారి పాల్గొని ప్రసంగించారు. గత పది సంవత్సరాలుగా కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ఉన్నారని, ఏ రాష్ట్రంలో లేని విధంగా కేరళ రాష్ట్రంలో దారిద్రరేఖకు దిగువన లేకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం చేసిన వ్యక్తి అన్నారు.
పేదవారికి నివసించడానికి ఇల్లు నిర్మించి ఇచ్చిన వ్యక్తి కేంద్ర బిజెపి ప్రభుత్వం కేరళకు ఇచ్చే బడ్జెట్లో కూడా సరిగ్గా నిధులు ఇవ్వని పక్షంలోనూ ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ ఒక్కటై అబద్ధాలతో కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చిందన్నారు. వచ్చిన 15 రోజుల్లో పినరయి విజయన్ పై లేనిపోని అబండాలేస్తూ బిజెపి, కాంగ్రెస్ కలిసి ఈడి దాడిని చేయిస్తూ అక్కడ కమ్యూనిస్టులపై దాడులు చేస్తూ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం అధికంగా ఆశ చూపించి ప్రజలను మభ్యపెట్టి గెలిచే పార్టీలు మీవైతే, నీతిగా నిజాయితీగా ఉండి డబ్బు మద్యం పంచని పార్టీ సీపీఐ(ఎం) అని స్పష్టం చేశారు. గురిగింజలాంటి పార్టీలు మీవైతే ముత్యం లాంటి మా భారత కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ అన్నారు. మీ నాయకులు భూ కబ్జాలకు, మహిళలపై దాడులకు పాల్పడతారన్నారు.
అదే సీపీఐ(ఎం) నాయకులు పేదల పక్షాన నిలబడి పేదలకు న్యాయం చేసే పార్టీ భారత కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ మాది అన్నారు. మీరు ఎన్ని ఈడీ దాడులు చేయించి, మా పార్టీ నాయకులపై దాడులు చేయించినా మీకు భయపడేది లేదన్నారు. ఇప్పటికైనా కమ్యూనిస్టు నాయకులపై ఈడీ దాడులు ఆపకపోతే మీకు సరైన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ కమిటీ సభ్యులు, జి, బాలస్వామి, ఏ రమేష్, ఎల్, బిసన్న, జి, బాలరాజు, భాస్కరు, జిల్లా ఆఫీసు కార్యదర్శి ఉమా, నందిమల్ల రాములు, పుల్లన్న, మద్దిలేటి, బాల పిరు,మన్యం, రత్నయ్య, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.



