– మిత్రజీవుల మనుగడకు ప్రమాదం
– పంటలపై ప్రభావం
నవతెలంగాణ – బొమ్మలరామారం : రైతులు పొలంలో ఉన్న వరి కుదు ళ్లుకు నిప్పు పెడుతుంటారు.ఈ కుదుళ్లు ఉంటే తిరిగి పంటవేసుకునే సమయంలో దున్నేందుకు. దుక్కికి అడ్డంకిగా ఉంటుందని పూర్తిగా కాల్చేస్తు న్నారు. ఇలా చేస్తే రైతుకే నష్టం జరుగుతుంది.నిప్పు పెడితే భూమి తన సారాన్ని కోల్పోతుంది.అలాగే ఉంచి దున్నిస్తే మంచి సారం వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. భూమిలో మెగ్నీషియం, కాల్షియం.సూక్ష్మజీవులు వృ ద్దితోపాటు నత్రజని పెరుగుతుంది. తద్వారా చౌడును తగ్గించి తర్వాత పంటకు ఉపయోగపడు తుందని సూచిస్తున్నారు.
తిరిగి పంట వేసుకునే టప్పుడు వేర్లు భూమిలోకి వెళ్లడానికి కూడా ఆవకాశం ఉంటుందని, ఫలితంగా మొక్క బాగా ఎదిగేందుకు దోహదపడుతుందని పేర్కొంటున్నారు. ఆదే నిప్పు పెట్టి కాల్చివేస్తే నేల సారవంతం కావడానికి, మొక్క ఎదుగుదలకు ఉపయోగపడే మేలు రకాలన్నీ నాశనం అవుతాయి. అలాగే పంటకు మేలు చేసే ఎర్రలు కూడా పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్లో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భూమిని దున్నే సమయంలో రైతులకు కొద్ది కష్టంగా ఉంటుంది.కాని దీని వల్ల భూమిలో సారం పెరగడంతోపాటు దిగు బడులు పెరిగి అంతిమంగా మేలు చేకూరుతుంది.
దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది
వంట వ్యర్థాలకు నిప్పు పెట్టడం సరైన విధానం కాదు. దీని వల్ల మిత్రజీవులు పూర్తిగా నశించిపోతాయి. తర్వాతి సీజన్ లో సాగుచేసే పంటల్లో దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. తడి పిన తరువాత దున్నితే నేలకు పోషకాహారాలుగా ఉపయోగపడుతాయి.



