– నివాళులర్పించిన సీపీఐ(ఎం), కాంగ్రెస్, టీఎంఆర్పిఎస్
నవతెలంగాణ-ఇల్లందు
సీపీఐ(ఎం) పార్టీ పూర్వ డివిజన్ కమిటీ సభ్యులు, 13వ నంబర్ బస్తీ వాసులు లక్క రాజేశ్వరరావు సోమవారం రాత్రి మృతి చెందారు. వార్త తెలుసుకొని పార్టీ మండల నాయకత్వం, సీనియర్ నేత వరంగంటి రాజమొగిలి ఆయన భౌతిక కాయానికి ఎర్ర జెండా కప్పి, పూల మాలలు వేసి జోహార్లర్పించారు. అనంతరం పార్టీ ఏరియా ఇన్‌చార్జి ఆలేటి కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడారు. లక్క రాజేశ్వరరావు చిన్నతనం నుండి పార్టీలో బస్తీ స్థాయి నుండి డివిజన్ స్థాయికి ఎదిగిన నేత అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలను నిర్మించిన మహా నేతని కొనియాడారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి కృష్ణ, సర్వన్ కుమార్, వాసం రాము, ఆలేటి సంధ్య, వెంకటేశ్వర్లు, తాళ్లూరి పద్మ, మహమూద్, లక్ష్మణ్ పాసి, ఎన్ శ్రీనివాస్, మీనాక్షి, రాము పాసి, శ్రీను, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు.
నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మెన్
లక్క రాజేశ్వరరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఇల్లందు మున్సిపల్ చైర్మెన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు వారి స్వగృహానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నేత
రాజేశ్వరరావు మృతి చెందిన ఈ విషయం తెలుసుకున్న పట్టణ కాంగ్రెస్ పార్టీ కమిటీ నాయకులు పెండ్యాల హరికృష్ణ ముదిరాజ్ మృతదేహానికి పూలమాలతో నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబానికి రూ.5000 ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల శ్యామ్ మాదిగ, శ్రీహరి నివాసం గ్రూప్ కమిటీ సభ్యులు బెల్లంకొండ శ్రీనివాస్, పెండ్యాల నరేష్, సయ్యద్ జియా, ఆలేటి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.