Wednesday, June 3, 2026
E-PAPER
Homeఖమ్మంలండన్ వెళ్తున్న కోసూరి నవ్యకు సీపీఐ(ఎం) నాయకుల అభినందనలు 

లండన్ వెళ్తున్న కోసూరి నవ్యకు సీపీఐ(ఎం) నాయకుల అభినందనలు 

- Advertisement -

నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండల పరిధిలోనే గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన కోసూరి శ్రీనివాసరావు, మమత దంపతుల కుమార్తె కోసూరి నవ్య బిటెక్ పూర్తి చేసి బుధవారం రాత్రి ఎమ్మెస్ చదువు కోసం లండన్ వెళుతున్న సందర్భంగా సీపీఐ(ఎం) గ్రామ కమిటీ అభినందనలు తెలిపింది. కోసూరు శ్రీనివాసరావు, మమత దంపతుల అత్యంత నిరుపేద కుటుంబం. అనేక కష్టాలు పడుతూ తన కుమార్తెను ఉన్నత స్థాయిలో చూడాలనే పట్టుదల నేడు ఫలించింది. బీటెక్ పూర్తి చేసిన నవ్య ఉన్నత చదువుల కోసం లండన్ వెళుతుండటంతో ఆ తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదు. సెంటు భూమి లేకపోయినా కూలీ పనులతో పాటు తన వృత్తి చేసుకుంటూ హైదరాబాదులో కుమార్తెను చదివించాడు. బీటెక్ పూర్తి చసిన అనంతరం

 కుమార్తెను లండన్ పంపించేందుకు అవసరమైన ఆర్థిక వనరులను దంపతులు సమకూర్చుకున్నారు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్తున్న కోసూరి నవ్య కు సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మాదినేని నారాయణ, లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షులు మాదినేని వీరభద్ర రావు, గ్రామ సర్పంచ్ మంద కరుణ, ఉపసర్పంచ్ కారంగుల చంద్రయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు జొన్నలగడ్డ సునీత, నాయకులు ఏడునూతల లక్ష్మణరావు, కళ్యాణపు శ్రీనివాసరావు, కోసూరు ప్రసాద్, వల్లంకొండ సురేష్, యూటీఎఫ్ జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు, తమ్మారపు లక్ష్మణరావు, కోట కాటయ్య తదితరులు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -