Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి బరువు తూచే యంత్రం వితరణ

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి బరువు తూచే యంత్రం వితరణ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని చౌట్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో చిన్న పిల్లలు, పెద్దల బరువులను తూచే యంత్రాన్ని వితరణ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి చైర్మన్ లుక్క గంగాధర్, సభ్యుల చేతుల మీదుగా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బందికి బరువులను తూచే యంత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ లుక్క గంగాధర్ మాట్లాడుతూ బరువులను తూచే యంత్రం ద్వారా ఆరోగ్య ఉప కేంద్రానికి విచ్చేసే పిల్లల, పెద్దల బరువును చూడడానికి సిబ్బందికి ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. యంత్రాన్ని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బరువులను తూచే యంత్రాన్ని విరాళంగా అందజేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి సభ్యులకు ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మహబూబ్, ఉప సర్పంచ్ పవన్, లయన్స్ క్లబ్ కార్యదర్శి రేవతి గంగాధర్, కోశాధికారి తెడ్డు రమేష్,  సభ్యులు గుండోజి రవీందర్, బద్దం రాజశేఖర్, పాలెపు నర్సయ్య, పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -