
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని డోడర్నా తండా 1లో గల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సోమవారం సీపీఐ(ఎం) పార్టీ నాయకులు దుర్గం నూతన్ కుమార్, పార్టీ సభ్యులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో మాట్లాడి విద్యార్థుల నుండి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు సరిపోయే తరగతి గదులను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేయడం జరిగింది. మూత్రశాలలు, మరుగుదొడ్లు విద్యార్ధుల కు సరిపడే గదులను అదనంగా నిర్మించాలి. విద్యార్థులు రాత్రి సమయంలో పడుకోవడానికి సరైన రూమ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. దింతో అదనంగా గదులు నిర్మించాలి. అదే విదంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆశ్రమ పాఠశాలను సందర్శించిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు డాకూర్ తిరుపతి కుబీర్ మండల కార్యదర్శి జాదవ్ రమేష్ లు పాల్గొన్నారు.