న్యాయమూర్తిపై విమర్శలు కోర్టు ధిక్కారం కాదు

– మద్రాసు హైకోర్టు
చెన్నై: జడ్జిపై విమర్శలు, పరువు నష్టం కోర్టు ధిక్కారంగా పరిగణించబడదని మద్రాసు హైకోర్టు పేర్కొంది. జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత ఆర్‌ఎస్‌ భారతిపై దాఖలైన పిటిషన్‌ను తిరస్కరిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. యూట్యూబర్‌ సవుకు శంకర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించారు.జస్టిస్‌లు ఎస్‌ఎం సుబ్రహ్మణ్యం, వి.శివజ్ఞానంతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇలాంటి విమర్శలు కోర్టు పనితీరును మెరుగుపరుస్తాయని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది.

Spread the love