చిన్న వర్షానికే కరెంట్ కట్

నవతెలంగాణ- రెవల్లి: గోపాల్ పేట్ మండలం చాకలిపెల్లి సబ్స్టేషన్ లో ఉన్నటువంటి 11 కె.వి విద్యుత్ లైన్లు చిన్న వర్షానికే ట్రిప్ అవుతూ ఉన్నాయి. ఈ సబ్స్టేషన్ లో ముఖ్యంగా కేశంపేట 11 కె.వి ఫీడర్ ఒకటి ఉంది. ఈ లైన్ యొక్క పరిస్థితి మరి దారుణం. చిన్న చినుకులు పడినా, కొంచెం చిన్న గాలి వీచినా, ఫీడర్ కు కరెంటు లేకుండా పోతుంది. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అయితే మరీ దారుణంగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా కరెంటు బాగానే ఉంటున్న, అర్ధరాత్రి అయితే చాలు కరెంటు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ఫీడర్ కింద ఉన్నటువంటి గ్రామాలు మరియు ఆ గ్రామాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు కరెంటు లేక, దోమలతో, ఈగలతో చాలా సతమతమవుతున్నారు. పెద్దవారు మరియు చిన్న పిల్లలు నిద్రపోలేని పరిస్థితి. దీని విషయమై గోపాల్ పేట్ మండల విద్యుత్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఇకముందు చూడాలి.
Spread the love