ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి నియోజకవర్గంలో 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సూచించారు. శిథిల వ్యవస్థలో, మట్టి ఇండ్లలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచంచారు. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని రెవిన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, పోలీసు అధికారులు ప్రభుత్వ అధికారులు అందరు కూడా అప్రమత్తంగా పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపారు. ప్రజలు ఎవరు కూడా చెరువులు వాగులు ప్రవహిస్తున్న ప్రదేశంలోకి వెళ్లకూడదని, కరెంట్ స్థంబాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మొంథా తుఫాన్.. నియోజకర్గం వారీగా భారీ వర్షాలు
- Advertisement -
- Advertisement -



