
మండలంలోని డేడ్రా గ్రామస్థులు గ్రామా పటేల్ లింగు ఆధ్వర్యంలో శుక్రవారం పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ను కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం తమ గ్రామానికి సంబంధించిన సమస్యలు తెలిపారు. ముఖ్యంగా గుట్టపై ఉన్న గ్రామాలకు రోడ్డు సౌకర్యం విషయంలో (ఫారెస్ట్ క్లియరెన్స్) అదేవిధంగా గ్రామాలలో సిసి రోడ్ల విషయంలో, సెల్ టవర్ విషయంలో తీవ్ర ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఎలాగైనా మా సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. దానికి ఎంపీ నగేష్ సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా వర్షాలు తగ్గుముఖం పట్టగానే రోడ్లలకు సంబంధించిన పనులు మొదలు పెడతామని, ఫారెస్ట్ క్లియరెన్స్ విషయంలో అటవి అధికారులతో మాట్లాడి కచ్చితంగా క్లియరెన్స్ వచ్చే విధంగా కృషి చేస్తానని, గుట్టపై ప్రాంతంలో ఏదైనా అత్యవస సమయంలో అలాగే విద్యార్థులకు సంబంధించిన అంతర్జాల సేవల విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి తప్పకుండా టవర్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పోరెడ్డి శ్రీనివాస్ , డేడ్రా గ్రామ మాజీ సర్పంచ్ భీమ్రావు ,తదితరులు పాల్గొన్నారు.