
ఈనెల 17-18-6-2023 తేదీలలో ఓంకార్ భవన్ హైదరాబాద్ లో జరిగిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్ రాష్ట్ర కమిటి రెండు రోజుల పాటు జరిగిన సమావేశాలు జరిగాయి.ఈ సమావేశాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన దండి వెంకట్ రాష్ట్ర కన్వీనర్ గా రాష్ట్ర కమిటి సభ్యులుగా సబ్బని లత, కాంబ్లీ మధు లు ఎన్నికయ్యారు.బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ గా నల్లా సూర్యప్రకాష్ హైదరాబాద్. రాష్ట్ర కన్వీనర్ లు గా దండి వెంకట్ నిజామాబాద్ జిల్లా, కె.పర్వతాలు నల్గొండ జిల్లా, వనం సుధాకర్ మియాపూర్ హైదరాబాద్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణలో బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించడమే అమర వీరులకు బిఎల్ఎఫ్ ఇచ్చే రాజకీయ లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆధిపత్య కులాల యాజమాన్యంలో రాజకీయ పార్టీలను ఓడించి బహుజన వామపక్ష ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత కోసం ఉద్యమించాలి పిలుపునిచ్చారు.
బిఎల్ఎఫ్ నూతన కమిటి ఎన్నిక
17-18- 6-2023 తేదీలలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో
రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో 33 జిల్లాలకు చెందిన ప్రతినిధులు 100 మంది హాజరయ్యారు.
ఈ కింద పేర్కొన్న కమిటి ఎన్నికయ్యింది.
బిఎల్ఎఫ్ చైర్మన్ గా నల్లా సూర్యప్రకాష్
కన్వీనర్ లుగా
దండి వెంకట్,కె.పర్వతాలు , వనం సుధాకర్.
రాష్ట్ర కమిటి సభ్యులుగా
కుంభం సుకన్య, సబ్బని లత, ఎస్.సిద్దిరాములు, కె.మధు, ధనలక్ష్మి, గాజుల శ్రీవాస్, వల్లెపు ఉపేందర్ రెడ్డి, వస్కుల మట్టయ్య, ఎం.ఎం. గౌడ్, రాంబాబు తదితరులతో పాటు మరో 35 మంది కమిటి సభ్యులు ఎన్నికైనట్లు దండి వెంకట్ సోమవారం తెలియజేశారు.