రోజురోజుకు పెరుగుతున్న కాంగ్రెస్ ప్రచార హోరు

నవతెలంగాణ-గోవిందరావుపేట

నామినేషన్లు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రచారం రోజురోజుకు హోరెత్తుతోంది. తాజాగా గురువారం మండలంలోని దుంపల్లిగూడెం గోవిందరావుపేట చల్వాయి గ్రామాలలో ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరి ప్రచారం ఒక దశలో ఎన్నికల ర్యాలీని తలపిస్తోంది. కొత్త చేరికలతో కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్సాహంతో ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందుంది. ఇప్పటికే మండల వ్యాప్తంగా మొదటి దశ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసింది.  ఇతర పార్టీల నుండి అసంతృప్తి నాయకులను పార్టీలో చేర్పించడంలో నాయకులు సఫలీకృతమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీలో చిన్న పెద్ద స్థాయి నాయకులందరినీ కలుపుకొని ఎమ్మెల్యే సీతక్క ఒంటరి పోరాటం నిర్వహిస్తున్నారని అన్నారు. ఎస్టీ మహిళ నియోజకవర్గంలో సీతక్కను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్ లు ములుగులో సభలు నిర్వహించనున్నారని ఎంత అధికంగా ఒత్తిడి పెంచితే అంతా అధికంగా ప్రజాబలం పెరుగుతుందన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. అధికారులు కొన్నిచోట్ల అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని అందులో కీలక పోర్టు పోలియో అక్క తీసుకుంటుందని అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని అంటున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీనా పట్ల మహిళలు పెద్ద సంఖ్యలో హర్షం వ్యక్తం చేస్తున్నారని రైతులు కూడా ఆమోదం తెలుపుతున్నారని వారి హర్షద్వానాలే పార్టీ ప్రచారానికి నూతన జీవసత్వాలను అందిస్తుందని నాయకులు తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో ప్రచారంలో పాల్గొనడమే అందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. గ్రామాల ప్రచార కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు ఎంపీటీసీలు సర్పంచులు వార్డు సభ్యులు కమిటీ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love