- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు ఇరుదేశాల నుంచి సంకేతాలు వెలువడ్డాయి. యుద్ధ పరిస్థితులకు ముగింపు పలికే దిశగా ఒప్పందం కుదిరిందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఘరీబాబాది వెల్లడించారు. ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లో ఒప్పందంపై అధికారిక సంతకాలు జరగనున్నాయని, తుది ఒప్పందం కోసం మరో 60 రోజుల పాటు చర్చలు కొనసాగుతాయని తెలిపారు. అయితే, “డీల్ చేసుకోవడం అంటే శత్రువులను నమ్మినట్లు కాదు” అని వ్యాఖ్యానిస్తూ అమెరికా హామీల అమలును పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.
- Advertisement -



