- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాతో శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ధ్రువీకరించింది. ఇరాన్ డిప్యూటీ విదేశాంగశాఖ మంత్రి కజెం గరీబాబాదీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఒప్పందంపై ఈ నెల 19న ఇరు దేశాలు సంతకం చేస్తాయన్నారు. దిగ్బంధనం ఎత్తివేత, ఇరాన్ ఆస్తుల విడుదలకు అమెరికా హామీ ఇచ్చిందని చెప్పారు. తుది ఒప్పందంపై చర్చల కోసం 60 రోజుల వ్యవధి ఉందన్నారు. మరోవైపు.. అమెరికా యుద్ధం ముగించక తప్పలేదని ఐఆర్‌ఐబీ వ్యాఖ్యానించింది.
- Advertisement -



