– ఐదేండ్లలో 200 మందికిపైగా మావోయిస్టులు హతం
– మోడీ ప్రభుత్వం వచ్చాక పెరిగిన ఎన్‌కౌంటర్లు
చర్లా : ఐదేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా వందలాది మంది మావోయిస్టులు హతమయ్యారు. కేంద్రంలో రెండోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..(2019 నుంచి 2024 ఏప్రిల్ 2 వరకు) 248 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తాజా లెక్కలు చెబుతున్నాయి. సంవత్సరాల వారీగా చూసుకుంటే.. మావోయిస్టుల తో జరిగిన ఎన్‌కౌంటర్లను పరిశీలిస్తే.. 2019లో (107), 2020లో (109), 2021లో (82), 2022లో (69), 2023లో (69), 2024 (ఏప్రిల్ 2 వరకు) 28 సార్లు ఎన్‌కౌంటర్లు జరిగాయి.
ఈ ఐదేండ్లలో..
ఐదేండ్లలో సుమారుగా 240 మందికిపైగా మావోయిస్టులు చనిపోయారు. ఇక సంవత్సరాల వారీగా చూసుకుంటే.. 2019లో (65), 2020లో (40), 2021లో (51), 2022లో (30), 2023లో (20), 2024 ఏప్రిల్ 2 వరకు (42) మంది మృతి చెందారు. 2019వ సంవత్సరంలో 65 మంది మృతి చెందితే.. 2024లో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 42 మంది మావోయిస్టులు మృతి చెందడం గమనార్హం.
అరెస్టుల వారీగా..
ఐదేండ్లలో సుమారుగా 1700 మందికిపైగా మావోయిస్టుల్ని అరెస్టు చేశారు. 2019లో (499), 2020లో (438), 2021లో (494), 2022లో (291), 2023లో (428), 2024 (ఏప్రిల్ 2 వరకు) 167 మంది అరెస్టయ్యారు.
ఇక మావోయిస్టులకు భద్రతా సిబ్బంది జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 140 మంది దాకా భద్రతా సిబ్బంది మృతి చెందారు. 2019లో (21), 2020లో (36), 2021లో (46), 2022లో (10), 2023లో (25), 2024 (ఏప్రిల్ 2 వరకు ) ఆరుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
పౌరులూ…
మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన కాల్పుల్లో సుమారుగా 200 మందికి పైగా పౌరులు చనిపోయారు. 2019లో (46), 2020లో (47), 2021లో (33), 2022లో (36), 2023లో (41), 2024 (ఏప్రిల్ 2 వరకు ) 17 మంది అమాయక పౌరులు హతమయ్యారు.