రాముడి ప్రాణప్రతిష్ఠ.. 22న సెలవు ప్రకటన

నవతెలంగాణ – హైదరాబాద్: జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులకు ఒకపూట సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హరియాణాలో ఇప్పటికే పాఠశాలలకు సెలవు ఇచ్చారు. గోవాలో స్కూళ్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకూ హాలిడే ప్రకటించారు.

Spread the love