మోడీనామిక్స్‌ వల్లే దిగజారుతున్న ఆదాయాలు

మోడీనామిక్స్‌ వల్లే దిగజారుతున్న ఆదాయాలు”కేవలం 3 నెలల్లో, శాశ్వత సిబ్బందిని పెంచుకోవాలని చూస్తున్న కంపెనీలు 30.9 శాతం నుంచి 15.9 శాతానికి పడిపోయాయి. తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్న కంపెనీలు కూడా వెనకడుగు వేస్తున్నాయి. ‘మోడీనామిక్స్‌’ వల్ల ప్రజల ఆదాయాలు దిగజారుతున్నాయి. దీంతో డిమాండ్‌ పడిపోతుంది. అంతిమంగా అది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేందుకు దారి తీస్తుంది”.
ప్రధాని మోడీ వివిధ సందర్భాల్లో భారత దేశ ఆర్థిక వ్యవస్థ భేషుగ్గా ఉందని డాంబికాలు పోతున్నారు. ఆయన చేస్తున్న ప్రకటనలకు, వాస్తవ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం పూర్తి భిన్నంగా ఉన్నది. మోడీ చేపట్టిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమం ఓ ప్రహసనంగా మారింది. ఫ్యాక్టరీ ఉత్పత్తిలో 14.9 శాతం వద్ధిని సాధించాలనేది మేకిండియా లక్ష్యంగా ప్రకటించారు. నిజానికి, ఈ రంగంలో వద్ధి రేటు పదేండ్లలో 5.9 శాతానికి మించి లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.
– సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

Spread the love