రాజ్యాంగ వ్యతిరేకి బీజేపీని ఓడించండి.. కాంగ్రెస్ ను గెలిపించండి: సభావట్ రాములు నాయక్

నవతెలంగాణ – హలియా 

దేశంలో రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ, నియంతృత్వ బీఆర్ఎస్ పార్టీ లను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపినర్ మాజీ ఎమ్మెల్సీ సపవట్ రాములు నాయక్, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపియనర్ మాజీ ఎమ్మెల్సీ సభావట్ రాములు నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ అంజయ్య నాయక్ లు గిరిజన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హాలియా పాత ఐటిఐ కాలేజ్ లో వివిధ గిరిజన సంఘాల నాయకులతో మీడియా సమావేశం నిర్వహించడం జరిగిందిఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ పార్టీకి 400 సీట్లు ప్రజలు ఇస్తే ఎస్సీ ఎస్టీ, బిసి మైనార్టీలకు వర్తిస్తున రిజర్వేషన్లను రద్దు చేస్తామని బాహటంగా బిజెపి పార్టీ మోడీ చెప్పడం అంటే మనువాదాన్ని అమలు చేయాలని చూస్తున్నారన్నారు నల్లగొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారుతెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీలు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలపై దాడులు చేయిస్తూ ఉపకులాల మధ్య ఆహార అలవాట్ల పైన గొడవలు పెడుతూ చిచ్చు లేపుతున్నరని అన్నారు. బీజేపీని ఓడించి కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని కోరారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 స్థానాలలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) పార్టీకి మద్దతు ఇస్తూ మిగిలిన 16 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. తెలంగాణ గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్ మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సంపూర్ణంగా మద్దతిస్తూ వారిని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కోర్ర శంకర్ నాయక్, గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర కార్యదర్శి రమావత్ నాగేందర్ నాయక్ కౌన్సిలర్ ప్రసాద్ నాయక్ రమావత్ నరేష్ నాయక్ సర్దార్ నాయక్ మాజీ సర్పంచ్ బాలు నాయక్ ఎంపీటీసీ తుల్చనాయక్ హనుమంతు నాయక్ రాజు నాయక్ రవి నాయక్ మోతిలాల్ నాగు భగవాన్ ముని దత్తు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love